Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- మండల కేంద్రంలోమొల్ల విగ్రహావిష్కరణ, ఆత్మ గౌరవ సభ
నవతెలంగాణ-యాచారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మరుల సంక్షేమా నికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం యాచారం మండల కేంద్రం లో కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సాయి శరణం గార్డెన్లో కుమ్మరి సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆడాల గణేష్ అధ్యక్షతన కుమ్మరుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వృత్తి నైపుణ్యంలో కుమ్మరి సంఘం యువత పట్టు సాధించేందుకు త్వరలోనే మండల కేంద్రంలో రెండు ఎకరాల భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల తహసీల్దార్ల ను పిలిపించి ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుంటామని తెలి పారు. కుమ్మరి సంఘం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించు కునే విధంగా వీలు కలుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కుమ్మరుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. కుమ్మర నైపుణ్య వృత్తిని అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వృత్తి ఎంతో గొప్పదని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమ ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రె డ్డి, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జస్వంత్‌రావు, ప్రధాన కార్యదర్శి మలాజ్‌గిరి దయానంద్, గౌరవాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా కమిటీ సభ్యులు కాసుల వెంకటేష్, రేపాక రాంబాబు, మోహన్, ఆడాల భిక్షపతి, కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు కొండాపురం శ్రావణ్‌కుమార్, గౌరవ అధ్యక్షుడు ఆడాల వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కాకులారం జగన్, సభ్యులు నడికుడి కృష్ణ, కొండాపురం శ్రీశైలం, కొండాపురం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.