Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
కరెంటు వైర్లకు చెట్ల కొమ్మలు తగలకుండా తొలగిం చామని విద్యుత్ శాఖ ఏఈ ప్రదీ ప్‌కుమార్ తెలిపారు. ఆదివారం చెట్ల కొమ్ములను తొలగించారు. అంతంపగూడ, అంతప్పగూడ, సంకేపల్లి, పరివేద, మాసానిగూడ, రావులపల్లి, అలంకానిగూడ, లచ్చిరెడ్డిగూడా, కచ్చిరెడ్డిగూడ, గాజుల గూడ, కొండకల్, కొండకల్ తండా, శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని భవాని నగర్, సింగాపురం, మండల పరిషత్ కార్యాలయం ఎదుట చెట్ల కొమ్ములను తొలగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చీటికిమాటికి కరెంటు పోతుందని వినియోగ దారుల నుంచి ఫిర్యాదు రావడంతో మూడు రోజులపాటు తమ సిబ్బందితో కలిసి ఎక్కడెక్కడ కరెంటు వైర్లకు చెట్ల కొమ్మలు తాకుతు న్నాయో వాటిని తొలగించామన్నారు. ఈ కొమ్మలు యధావిధిగా ఉంటే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముం దస్తుగానే ఈ చర్యలు చేపట్టామని అన్నారు. కరెంటు ఎక్కడ పోయిం దని తెలుసుకోవడానికి సులభంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం శంకర్‌పల్లిలో అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా అంతరా యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తమకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్‌స్పెక్టర్, లైన్మెన్లు, హెల్పర్స్ పాల్గొన్నారు.