Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
'కంటి వెలుగు'ను ప్రతి ఒక్కరూ సద్విని యోగించుకోవాలని మహారాజ్పేట్ గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి అన్నారు.సోమవారం మండల పరిధిలోని మహారాజ్పేట్ గ్రామపంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో వెంకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామాల్లోని ప్రజలందరూ సద్విని చేసుకోవాలన్నారు. వైద్యులు అర్హులందరికీ కంటి పరీక్షలు చేసి, వారికి కండ్ల అద్దాలు, మందులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీత, వార్డు సభ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, డాక్టర్ గ్రామ కార్యదర్శి రమ్య, ఆప్టికల్ మిక్, ఆశా వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.