Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-శంకర్పల్లి
ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావును గెలిపించాలని రంగారెడ్డి జిల్లా- జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సోవారం శంకర్పల్లి మండలంల్లో జోరుగా ప్రచారం నిర్వ హించారు. ఏజీవీబీ, జడ్పీటీసీ కొండకల్, జడ్పిహెచ్ఎస్ శంకరపల్లి బార్సు, జడ్పిహెచ్ఎస్ శంకరపల్లి గర్ల్స్, జడ్పీహెచ్ఎస్ మహాలింగాపురం, జడ్పీహెచ్ఎస్ రావులపల్లి కలాను, పాఠ శాలలో ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లా డుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ మొదటి ప్రాధాన్యతతో ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావును గెలిపిం చాలని కోరారు. పాఠశాలలో వంద శాతం రిజల్ట్‌పై గురించి ఉపాధ్యాయుల నుంచి హామీ పత్రాలు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీసు కోవడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 200 పాఠశాలలు మూసి వేయడానికి చూడగా, భుజంగారావు సీఎంతో మాట్లాడి కొనసాగే విధంగా కృషి చేశారని తెలిపారు.అనంతరం కృష్ణారెడ్డి, పరమేష్, భాస్కర్, తాహెర్ అలీ 'మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాదయ్య, మండల కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, హరి పాల్గొన్నారు.