Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేదలకు సాయం చేయడంలో ఆనందం : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలోని మోకిలా గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయం చేవెళ్ల పార్లమెంటు మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం రాత్రి ప్రారంభించారు. కొండా విశ్వేశర్రెడ్డి జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు బర్త్ డే కేక్ కట్ చేసి,పలువురు పంచుకున్నారు.ఈ సందర్భంగా శంకర్పల్లి మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల సంబంధించిన మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా రూ.1500 చెక్కులను అందజేశారు. అనంతనరం ఆయన మాట్లాడుతూ తన బర్తడే పార్టీని ప్రజలందరి మధ్యలో జరుపుకుని, పేదవారికి సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాములుగౌడ్, మున్సిపల్ అధ్యక్షులు బీర్ల సురేష్, బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, జయరాం రెడ్డి, కేవీ ఫౌండేషన్ సిబ్బంది రాములు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.