Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శక్తి కేంద్ర ఇన్చార్జి దన్నే భాషయ్య
- చిత్తాపూర్లో బీజేపీ శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్
నవతెలంగాణ-మంచాల
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ వైస్ ఎంపీపీపీ, బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జి దన్నే భాషయ్య అన్నారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని చిత్తా పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ శక్తికేంద్ర కార్నర్ మిటింగ్లో ఆయన పాల్గొన్ని,మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే మన బతుకులు, మారతాయని, జీవితాలు మారుతాయని ఓట్లేసి గెలిపిస్తే ,అధికారం వచ్చిన తరువాత, ప్రజల హామీలు అమలు చేయడంలో విఫలమైయ్యారని దుయ్యబట్టారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా సీసీరోడ్లు, అండర్డ్రయినేజీ కూడా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతే గాక కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కూడా ఉపయోగించుకుని, ప్రజలకు కల్పించాల్సిన వసతులు, అభివృద్ధి పనులు చేపట్టడంలో విఫలమైందని దుయ్యబట్టారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, గ్రామాల్లో కనీస సౌకర్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయడాలి కోరారు.