Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సోమవారం పాదయాత్ర చేపట్టారు. ఈ సంధర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ, మయూరినగర్కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. అంతేకాకుండా కాలనీలో కనీస మౌలిక వసుతులు కల్పించడే ధ్యేయంగా పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. మయూరి నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులు, పరిశీలించి, కాలనీవాసులకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రయినేజీ, తాగునీటి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఏస్ నాయకులు, చంద్రికప్రసాద్, సోమేశ్వర రెడ్డి, జంగిర్, అశోక్, శివ, కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు నారాయణరావు, రామరాజు, నరసింహ రాజు, రంగరాజు, బాబ్జీ రాజు, మిరజ్ , విక్రమ్, వెంకట్, హరిబాబు పాల్గొన్నారు.