Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
కేఎంసీ విద్యార్థిని ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏబీవీపీ మండల నాయకులు రాకేష్ నాయక్, రిషికేష్ గౌడ్, ప్రణరు, నితిన్ అన్నారు. కేఎంసీ విద్యార్థిని మతి చెందడంతో సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో శంకర్పల్లి చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని రాష్ట్ర హౌం శాఖ మంత్రి మహమూద్ అలి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామ చేయాలన్నారు. అదేవిధంగా డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం అనంతరం వైద్య విద్యా కళాశాలలో ర్యాగింగ్ సాధారణమని ప్రకటించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.