Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి
- చరికొండలో హాత్ సే హాత్ జోడో యాత్ర
నవతెలంగాణ-ఆమనగల్
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని కల్వకుర్తి మాజీ శాసన సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని చరికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 'హాత్ సే హాత్ జోడో' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింప డమే లక్ష్యాంగా నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు అన్ని, ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కష్టపడి పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు పార్టీ నాయకులతో వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా గడప గడపకూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను అందజేశారు.
-సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన చల్లా
కడ్తాల్ మండలంలోని ముద్వెన్ గ్రామానికి చెందిన రుద్ర సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తనవంతు సహాయంగా వారికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి, కడ్తాల్ ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యులు పాలకుర్ల రాములు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బీక్యా నాయక్, మండల అధ్యక్షుడు యాట నర్సింహ ముదిరాజ్, పీఏసీఎస్ డైరెక్టర్ చేగూరి వెంకటేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ హీరాసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ యాదయ్య, నాయకులు మధు, సురేందర్ రెడ్డి, నరసింహ, కార్తీక్, యాదయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.