Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సర్పంచ్ కడమోని శ్రీశైలం, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కుమ్మరి శంకర్
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలం గ్రామాభివృద్ధి లక్ష్యంగా విడతల వారిగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి శంకర్ అన్నారు. సోమవారం దేవునిపడకల్ గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో ఎన్ఆర్ఐఇజీఎస్ నుంచి మంజూరైన నిధులతో అంబటి వెంకయ్య ఇంటి నుంచి అంబటి నరసింహ ఇంటి వరకు రూ.10 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనలు సర్పంచ్ కడమోని శ్రీశైలంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో నిధులు మంజూరైనట్టు తెలిపారు. విడతల వారీగా గ్రామంలోని అన్ని కాలనీలలో సీసీరోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు.గ్రామాభివృద్ధిలో గ్రామస్తులంతా భాగస్వాములై, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మూడు పర్యాయలుగా ప్రజల మన్నన పొందుతూ ప్రజలకోసమే పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కడమోని శ్రీశైలం, ఉప సర్పంచ్ రాజమోని తిరుపతి, వార్డు సభ్యులు రాములమ్మ, నర్సింహా, లక్ష్మమ్మ, వెంకటేష్, గణేష్, రవి, రైతు సంఘం అధ్యక్షులు రావిచెడు అంజయ్యగౌడ్, విద్య కమిటీ చైర్మెన్ అంబటి లక్ష్మయ్య, సత్యం, పడకల్ మాజీ సర్పంచ్ మూడవత్ శంకర్ నాయక్, లింగయ్య, మండల యూత్ వైస్ అప్ అధ్యక్షులు కానుగుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.