Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్
- గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి
నవతెలంగాణ-ఆమనగల్
వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్ అన్నారు. ఆమన్గల్ బస్టాండ్ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై, వరంగల్ జిల్లాలో ర్యాగింగ్ భూతానికి బలైన ధరావత్ ప్రీతి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం స్థానిక గిరిజన నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి జడ్పీటీసీ అనురాధ పత్య నాయక్ మాట్లాడారు. ప్రీతిని ర్యాగింగ్ చేసిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ రాంపాల్ నాయక్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, ఎంపీటీసీ సరిత పంతు నాయక్, నాయకులు దశరథ్ నాయక్, రమేష్ నాయక్, రవీందర్ నాయక్, కష్ణ నాయక్, రూపం వెంకట్ రెడ్డి, గన్య నాయక్, చంద్రు నాయక్, శ్రీను నాయక్, వడ్డే వెంకటేష్, అల్లాజీ, రవి రాథోడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.