Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల సంఘం మండల అధ్యక్షురాలు కంబాళ్లపల్లి ఉదయశ్రీ
- రిలే నిరాహార దీక్షకు సర్పంచుల మద్దతు
నవతెలంగాణ-యాచారం
కిసాన్ ఆగ్రో ఫిడ్స్ పేరుతో నడుస్తున్న బొక్కల కంపెనీని ప్రభుత్వం స్పందించి, వెంటనే రద్దు చేయాలని సర్పంచుల సంఘం యాచారం మండలం అధ్యక్షురాలు కంబాళ్లపల్లి ఉదరు శ్రీ డిమాండ్ చేశారు. సోమవారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో బొక్కల కంపెనీ కి వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష 26వ రోజుకు చేరుకుంది. అనంతరం ఈ దీక్షకు సర్పంచుల సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా బొక్కల కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన ప్రజలు భరించలేక స్వచ్ఛందంగా దీక్ష చేస్తున్నారని తెలిపారు. నాలుగు గ్రామాల ప్రజలందరూ కలిసి కంపెనీకి వ్యతిరేకంగా దీక్ష చేస్తుంటే పొల్యూషన్ బోర్డ్ అధికారులు స్పందించకపోవడం సరైంది కాదన్నారు. బొక్కల కంపెనీని బందు చేయాలని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రస్తావించిన విషయం ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సంబ ంధిత అధికారులకు బొక్కల కంపెనీ పూర్తి స్థాయిలో బంద్ చేయాలని సంబంధిత శాఖలకు లెటర్లో కూడా రాశారని చెప్పారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బొక్కల కంపెనీని పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచి ఎత్తివేయాలని సర్పంచుల సంఘం నుంచి ఉదయశ్రీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ ఎండి హబీబుద్దిన్, తక్కల పల్లి సర్పంచ్ కంబాళ్లపల్లి సంతోష, ఉపసర్పంచ్ కావలి జగన్, ఎంపీటీసీ కుందారపు సుమతమ్మ, నాయకులు మారేడుపల్లి నరేందర్ రెడ్డి, తంబా ళ్లపల్లి రమేష్, కుందారపు లోహిత్ రెడ్డి, విప్లవ కుమార్, జంగయ్య, శ్రీనివాస్, శివ, తదితరులు పాల్గొన్నారు.