Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి
- 37 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేసీఆర్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.ప్రగతి నివేదన పాదయాత్ర సోమవారం 37వ రోజుకు చేరింది. ఈ యాత్ర మంగళ్‌పల్లి, సాహెబ్గూడల్లో నిర్వహించి, గడపగడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. ముందుగా గ్రామానికి చేరుకోగానే మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామ స్థానిక నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రూ.2లక్షల అభివృద్ధి పనులు మంజూరి కావాలన్న ఎంతో కష్టంగా ఉండేదనీ, కానీ నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు, మంగల్‌పల్లి మీదుగా నూతన రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.60 కోట్లతో నిర్మాణం చేశామన్నారు. ఉ.మంగల్‌పల్లి నుంచి కొంగర వరకు రోడ్డు మరమ్మతుల కోసం రూ.7కోట్లు మంజూరయ్యాయనీ, వచ్చే నెల రోజుల్లోనే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. మంగల్‌పల్లిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.2 కోట్ల11లక్షల నిధులు కేటాయిం చడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షులు జంగయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కోరె కళమ్మ, ఏఎంసీ చైర్మన్ చంద్రయ్య, నాయకులు కోరె జంగయ్య, పాయిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, కౌన్సిలర్లు వనం శ్రీనివాస్, క్రిష్ణంరాజు, నర్సగళ్ల ప్రవీణ్ తదితరులున్నారు.