Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్చి 1వ తేదీన శంషాబాద్ ఏఎల్ఓ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడిపై ఉందని కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్ అన్నారు. సోమవారం కాటేదాన్ చౌరస్తాలో కార్మికులకు కరపత్రాలు ఇచ్చి, సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంద ర్భంగా రుద్ర కుమార్ మాట్లాడుతూ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం ఏర్పడి 40 ఏండ్లు గడుస్తున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు కార్మిక చట్టాలు అమలు కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1979 వలస కార్మిక చట్టాన్ని అమలు చేయకుండా ఇక్కడి యాజమాన్యాలు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించు కుంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ,పిఎఫ్ అంటే కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కంపెనీల్లో కార్మిక చట్టాలు అమలు అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలస్వామి, సచిన్, ప్రవీణ్, రాహుల్, జగన్, గంగాధర్, సూర్యకాంత్, జగన్నాథ్ పాల్గొన్నారు.