Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
- సీపీఐ(ఎం) ఆమనగల్ ఏరియా కన్వీనర్‌గా కాన్గుల వెంకటయ్య
నవతెలంగాణ-ఆమనగల్
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు, పెత్తందార్లకు వత్తాసు పలుకుతూ పేద బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని -సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ అన్నారు. ఆమనగల్ పట్టణంలో సోమ వారం ఆమనగల్ కడ్తాల్ తలకొండపల్లి మండలాల సీపీఐ (ఎం) పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సీపీఐ(ఎం) కన్వీనర్ కాన్గుల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ పాల్గొన్ని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి, కార్మికుల హక్కులను కాలరాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీస వేతనాలు అమలు చేయ కుండా 12 గంటల పని భారం వేసి, కార్మి కుల జీవన విధా నాన్ని అస్తవ్యస్తం చేస్తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు మద్దతు ధర ప్రకటించి, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలన్నారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి, ఇంటి స్థలం ఉన్న వారికి ఇండ్లు కట్టుకునేందుకు వీలుగా రూ.5 లక్షలు అందించి, భూమి లేని రైతులకు భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలు సాగు చేసుకుంటున్న భూములు కబ్జా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. అనంతరం సీపీఐ(ఎం) ఆమనగల్ ఏరియా నూతన కన్వీనర్‌గా కాన్గుల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీలో ఆయనతో పాటు 11 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మధుసూదన్ రెడ్డి, శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి బి.కవిత, సీపీఐ(ఎం)తలకొండపల్లి కార్యదర్శి గుమ్మడి కురుమయ్య, ఆమనగల్ కార్యదర్శి పిప్పళ్వ శివశంకర్, సభ్యులు పోచయ్య, రమేష్, నరసింహ, లాలూ నాయక్, హంసమ్మ, నరసింహ పాల్గొన్నారు.