Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్ తిరుపతిరావు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజావాణిలో ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకోవడానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ తిరుపతి రావు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించి, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వివిధ అంశాలపై 85 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.