Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య
- పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది
పరిగిపట్టణ కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్నా వాటికి తగినట్టుగా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పరిగి పట్టణ కేంద్రం నుండి పోయే బీజాపూర్, హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండటంతో ఎప్పుడు ఈ రహదారి రద్దీగానే ఉంటుంది.
నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణంలో ఉదయం 10 గంటలు నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ రహ దారికి ఇరువైపులా వాహనాలతోనే నిండిపో యి ఉంటుంది. దీనికితోడు పాదచారులు కూడా నడవడానికి వీలుండటం లేదు. వాహ నాలకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లపై నే నిలుపుతున్నారు. పరిగి నియోజకవర్గ కేంద్రం కావడంతో వివిధ గ్రామాల నుంచి పనుల నిమిత్తం ఎంతో మంది ద్విచక్రవా హ నాలు, ఆటోలు, కార్లలో వస్తుంటారు. పార్కిం గ్ సదుపాయం లేకపోవడంతో చాలావరకు వాహనాలు రోడ్లపైనే నిలిపి తమ పనులు చేసుకుంటున్నారు. దీనితో వాహనాల పార్కింగ్ సమస్య రానురానూ జఠిలమవు తుంది. అధికారులు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడంతో తమ వాహనా లను రోడ్డుపై నిలిపితే పోలీసులు జరిమా నాలు విధిస్తున్నారని పలువురు వాహనదా రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువే
పరిగి పట్టణ కేంద్రంలో శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతుంది. ఈ రెండు రోజుల పాటు పరిగి పరిసర ప్రాంతా లకు చెందిన రైతులు, వ్యాపారులు, కూరగా యల వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ట్రాక్ట ర్లు, ఆటోలు, ట్రాలీ ఆటోల్లో తీసుకొస్తా ు. వ్యాపారస్తులు, ఇతర పనుల మీద వచ్చే వారు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తీసుకుని వస్తారు. వాహనాల పార్కింగ్‌కు సరైన స్థలం లేకపోవడంతో గంజిరోడ్డులోని వ్యాపార సము దాయాల ముందు, మెయిన్ రోడ్‌లోని వ్యాపార సముదాయాల ముందు, బ్యాంకుల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. గంజి, మార్కెట్ రోడ్లో జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాహనదా రులు, పాద చారులు ఈ రెండు రోజు ల్లో గంజి, మార్కెట్ రోడ్లో నడవలేనంత రద్దీగా ఉంటుందని పలువురు వాపోతున్నా రు. ఇప్పటికైనా పట్టణంలో పార్కింగ్ సమస్యలు పరిష్కరించి రాకపోకలకు ఇబ్బంది. లేకుండా చూడాలని స్థానికులు, వ్యాపారులు, వాహ నదారులు, తదితరులు అధికారులను కోరుతున్నారు.
మద్యం దుకాణాల ఎదుట వాహనాల క్యూ
పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి ఇరువైపులా, గంజి రోడ్డులో మద్యం షాపులు ఉన్నాయి. మద్యం ప్రియులు వైన్ షాపుల ముందు ద్విచక్రవాహనాలు, ఇతర వామనా లను గంటల తరబడి నిలుపుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో పాటు తరుచూ ప్రమాదాలు కూ డా చోటుచేసుకుంటున్నాయి.
ప్రమాదాలకు కేంద్ర బిందువుగా రహదారులు
పట్టణ కేంద్రంలో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం చోటుచేసుకుంటున్నాయి. వాహనాలను రోడ్డుపై నిలపడంతో ప్రమాదా లు ఇంకా అధికంగా జరుగుతున్నాయి. ము ఖ్యంగా పరిగి హైవే రోడ్డు ఇరువైపులా ఆటో స్టాండ్, బ్యాంకుల వద్ద ఎక్కువ మొత్తంలో వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. భారీ వాహ నాలు రోడ్లపై నిలుపుతుండటంతో పాదా చారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగల్స్ లేకపోవడంతో నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయని పలువురు వాపోతున్నారు.
ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశాం
నేషనల్ హైవే రోడ్డు ఆర్ ఎంబీ వారికి సంబంధించింది. కాబట్టి వారి సూచనల మేరకు పార్కింగ్ చేసుకోవాలి. పరిగి మార్కెట్ రోడ్డు ఇతర ప్రాంతా ల్లో ఉన్న ఖాళీ స్థలంలో పార్కిం గ్ ఏర్పాటు చేశాం. వాహనాదా రులకు, పాదాచారులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా అంతరాయం కలిగినట్లు మా దృష్టికి వస్తే కొత్త పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తాం.
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్
రోడ్డుపై వాహనాలు ఆపితే చర్యలు తప్పు
వ్యాపార సముదాయాల యజమానులు పార్కిం గ్ను ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకుని నిర్మాణా లు చేపట్టాలి. వ్యాపారస్తులు వ్యాపార సముదాయాల ముందు నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఒక వ్యక్తిని ఏర్పాటు చేసు కొని వాహనాలు షాప్ ముందు నిలుపకుండా చూసుకోవాలి. నిబంధనలకు విరు ద్ధంగా వాహనాలను రోడ్డుపై ఆపితే జరిమానా విధిస్తాం. ఎవరూ రోడ్డుపై వాహ నాలను ఆపకూడదు.
- సీఐ వెంకటరామయ్య