Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సమన్వయాధికారి పి.అపర్ణ
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)లలో 2023-24 సంవత్స రానికిగాను ఇంటర్ అడ్మిషన్స్‌కు నిర్వహించే ప్రవేశ పరీక్ష మార్చి 5 తేదిన ఆదివారం నిర్వహించను న్నట్లు వికారాబాద్ జిల్లా సమన్వయాధికారి పి.అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3223 మంది విద్యార్థులు 9 పరీక్షా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష రాయను న్నట్లు ఆమె తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, ఒక రోజు ముం దుగా ఎగ్జామ్స్ సెంటర్‌ను చూసుకోవలసిందిగా సూచిం చారు. ఈ సీఓఈ కళాశాలలో అడ్మిషన్ పొందిన వారికి అకాడమిక్ బోధనతోపాటు ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబం ధించి ప్రత్యేక శిక్షణ ఇస్తామని అభ్యర్థులు ఇంగ్లీష్ మీడి యంలో చదవవలసి ఉంటుందని ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. 9 పరీక్షా కేంద్రాలను, వాటి చిరునా మాలను గమనించగలరు. టీఎస్ డబ్ల్యూ ఆర్సిఓ ఈ బాలికలు వికారాబాద్(కొత్తగడి), టీఎస్ డబ్ల్యూఆర్ బాలురు శివారె డ్డిపేట్ పాఠశాల అనంతగిరిపల్లి, టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ మోమిన్‌పేట్ బాలి కలు పాఠశాల పాత కలెక్టరేట్ వికారాబాద్, టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బాలికలు బంట్వారం పాఠశాల తోల్కట్ట, టీఎస్డ బ్ల్యూ ఆర్ఎస్ బాలురు పెద్దేముల్ పాఠశాల శ్రీ కార్ ఉపకా ర్ కాలేజ్, అంతారంరోడ్, ఎన్టీఆర్ కాలనీ ఎదురుగా తాండూర్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలురు కొడంగల్ పాఠ శాల ముడిమ్యాల్ ప్రజ్ఞా భారతి ఇంజనీరింగ్ కాలేజ్, టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బాలురు పరిగి, టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ బాలికలు కోకట్, టీఎస్‌డబ్ల్యూఆర్ డిగ్రీ కళాశాల వికారా బాద్ టోల్ కట్ట, కేంద్రాల్లోపరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎండలు ఎక్కువ ఉన్నందున విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష నిర్వహించుకోవాలని ఆమె తెలిపారు.