Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మెను విజయ వంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. తాండూరు నియోజక వర్గంలో ఉన్న టీచర్స్ హెల్పర్స్ అందరు పాల్గొని మార్చి 1,2,3 తేదీల్లో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మె జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ అనుబం ధం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ 20 కోర్కెల సాధనకు రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుగుతున్నదన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అంగన్వాడి వ్యవస్థకు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానం ఉపసం హరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. చివరి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ టీచర్లతో సమానంగా అంగన్వాడి టీచర్లకు వేత నంలో సగం పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 2018లో అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు టీచర్లకు రూ.15 వేలు,హెల్పర్లకు రూ. 1250 రాష్ట్ర ప్రభు త్వం ఏరియర్స్‌తో సహా చెల్లించాలన్నారు. అంగన్వాడీ లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఎన్‌హెచ్‌టీఎస్ యాప్ రద్దు చేయాలని, ఖర్చులకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరూ పాల్గొనా ల ని మార్చి 1న తాండూర్ ఐసీడీిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు సమ్మె జయప్రదం చేయాలన్నారు. మార్చి 2, 3 తేదీల్లో వంటావార్పుతో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు 36 గంటల ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు.