Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కుల్కచర్ల
డాక్టర్ ప్రీతి కేసులో నిందుతులపై కఠిన చర్యలు తీసు కోవాలని బంజారా కుల సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ర్యాగింగ్ భూతానికి బలై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన డాక్టర్ ప్రీతిబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని సోమవారం మండల కేంద్రంలో అన్ని బంజారా కులసంఘాల ఆధ్వర్యంలో మానవ మృగం సైఫ్ అనే ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి వెంటనే ఉరిశిక్ష వేయాలని డి మాండ్ చేస్తూ ధర్నా చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయు లు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, దోమ మండలం విద్యాశాఖాధికారి హరిశ్చంద్ర, జేఏసీ కన్వీనర్ గాంగ్యనాయక్, యువనాయకుడు రవినాయక్, రవిలాల్, కుమ్మరి స్వామి, గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకు లు తిమ్యానాయక్, టీజీయూఎస్ మండలాధ్యక్షుడు సూ ర్యనా యక్, బలరాంనాయక్, రాజేందర్, బాలాజీ నాయక్, రాజు, రవి, శంకర్, వీరు, గోపాల్, వినోద్, అశోక్ తదిరులున్నారు.