Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మహిళా మోర్చా విభాగం మరింత బలోపేతం అవు తుందని రవికుమార్ యాదవ్ అన్నారు. బీఆల్విన్ కాలనీ డివిజన్ బీజేపీ కార్యాలయంలో శేరిలింగంపల్లి మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపెళ్లి పద్మ ఆధ్వర్యంలో మహిళా మో ర్చా సమీక్ష సమావేశం నిర్వహించారు. రవికుమార్ యాద వ్ మాట్లాడుతూ మోడీ గవర్నమెంట్ మహిళల అభ్యున్నతి కోసం వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తోందన్నారు. బేటి పడావ్-బేటి బచావ్, సుకన్య సమృద్ధి యోజన, మాతృ వందన యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన మొదలగు స్కీమ్స్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేయాలని మహిళా మోర్చా డివిజన్ నాయ కురాలులకు సూచించారు. కార్యక్రమంలో కొండాపూర్, శేర్లింగంపల్లి డివిజన్ నుండి పార్టీలో చేరిన మహిళలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వరలక్ష్మి అరుణ, రేణుక, కవిత, మహేశ్వరి, కృష్ణప్రియ, మాధవి, శ్రీలత రెడ్డి, విద్య పాండే, మమత, మాధవి లత, దేవి రెడ్డి, స్వప్న, సుజాత మొదలగు వారు పాల్గొన్నారు.