Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల విజ్ఞప్తులను నేరుగా అందుకున్న కలెక్టర్
- కొడంగల్ మున్సిపల్ పరిధిలో కలెక్టర్ నారాయణరెడ్డి విస్తృత పర్యటన
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ పట్టణంలోని పట్టణ ప్రకృతీ వనం, నర్సరీ, కంటివెలుగు శిబిరం, డయాలసిస్ సెంట ర్లను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. మంగళవారం పట్టణంలో రెండు ఎకరాల స్థలంలో నిర్మించ తలపె ట్టిన వెజ్ అండ్, నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన ఇసుక అంది స్తామని, పనులను నిరంతరంగా కొనసాగిస్తూ మె రుగైన పనులు చేపట్టి ఏప్రిల్ మాసాంతం వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. చెట్లకు సాసరింగ్ చేసి వేసవిలో ప్రతి రోజు నీరు పట్టాలన్నారు. హరితహారంలో నాటే మొక్క లు కనీసం 8-10 సైజు ఉండాలని సూచించారు. వచ్చే హరితహారంలో నాటేందుకు నర్సరీకి అవసర మైన 41 వేల మొక్కలను అందుబాటులో ఉంచా లన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ఆశాలు, ఏఎన్ఎం లను ఇంటింటికి పంపి అవసరమైన ప్రజలను గు ర్తించి క్యాంపులకు తీసుకురావాలన్నారు. కమ్యూ నిటీ హెల్త్ సెంటర్ను సందర్శించి వైద్య సేవలు పొందుతున్న రోగులను పలకరించారు. వారికి అం దుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణపు పనులను ఆయన పరి శీలించారు. మే నెల చివరి వరకు పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. తహ సీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ విభాగా లను పరిశీలించారు. అక్కడికి చేరుకున్న పలువురు ప్రజల నుండి వివిధ సమస్యలపై విజ్ఞప్తులను కలె క్టర్ నేరుగా స్వీకరించారు. అనంతరం ఎంపీడీ వో కార్యాలయంలో ఎంపీడీవో పాండు, మున్సిపల్ కమి షనర్ ప్రవీణ్ కుమార్లతో కలిసి సంబంధిత అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీ ల్లో మొదటి ప్రాధాన్యంగా పారిశుధ్యం పనులు చేప ట్టాలన్నారు. వేసవిలో గ్రామ పంచాయతీలోని ప్రతి హ్యాబిటేషన్కు భగీరథ సాగునీరు సమృద్ధిగా అందిం చాలన్నారు. భగీరథ నీరు అందకుంటే ప్రత్యామ్నా య మార్గాలు ఇప్ప టి నుండి చూసుకొని వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పరిష్కరించుకోవాలన్నా రు. హరితహారంలో నాటిన మొక్కలు వేసవికాలం లో చనిపోకుండా ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాలన్నారు. అన్ని శ్మశానవాటికలను వినియోగం లోకి తీసుకురావాలని, మరుగుదొడ్లు, నీటి సదు పాయాలు కల్పించాలని సూచించారు. గ్రామాలలో తడి, పొడి చెత్తను 100 శాతం సేకరించాలని కం పోస్టు షెడ్ల ద్వారా ఎరువుల తయారీ చేపట్టాల న్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలని ప్రతిరోజు అటెండర్లతో కార్యాలయాలలో పరిశుభ్రత పనులు చేయించాలన్నారు. రేషన్ షాపుల ద్వారా నిర్ణీత సమయంలో ప్రజలకు సరుకు లు అందేవిధంగా చూడాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని, పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అభ్య సించాలన్నారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ అందించి, ప్రమాదకర స్తంభాలు తీగలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో లేబర్ మొ బిలైజేషన్ పక్కగా జరగాలన్నారు. ఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టే పనులు గ్రామానికి ఉపయోగకరంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ సమ యానికి విధులకు హాజరుకావాలని, అటెండెన్స్ యాప్ను తప్పకుండా వాడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, తహసీల్దార్ బుచ్చయ్య, మున్సిపల్ డీఈ రంగనాథం, ఏఈ ఖాజా హుస్సేన్, డాక్టర్ కెవిఎన్ మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.