Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలి
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరి ష్కరించాలని, పాదయాత్ర డిమాండ్లను పరిష్కరిం చాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వ ర్యంలో తాండూర్ నియోజకవర్గ కమిటీతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికులు బయలు దేరి వెళ్లారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్ మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయకుండా కనీస వేతనాలు ఇవ్వకుండా సుమారు రూ.40 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై, కారోబార్, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులు చేయిస్తున్నారన్నా రని తెలిపారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజ నులు, బలహీనవర్గాలకు చెందిన పేదలే, ఉమ్మడి రాష్ట్రంలోనూ నిరాదరణకు గురవుతున్నారన్నారని తెలిపారు. కెేసీఆర్ సీఎం అయిన తర్వాత వీరి వేతనాలను రూ.8500లకు పెంచినా, ఆ పెంపు శాస్త్రీయ పద్ధతిలో లేదన్నారు. 2023లోని జనాభా, పంచాయతీ విస్తరణకనుగుణంగా సేవలందిస్తున్నా రన్నారు. 2011 జనాభాను మాత్రమే లెక్కలోకి తీసుకొని 500 జనాభాకు ఒక కార్మికుడిగా పరిగ ణించాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ పెంచిన వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి మాత్రమే వస్తున్న వేతనాలను అందరూ పంచుకుం టున్నారని వివరించారు. దీంతో అత్యధిక మంది కార్మికులకు రూ.3500ల నుండి రూ.4500ల వరకు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. వేతనాలు పెంచామనే సాకుతో వివిధ కేటగిరీలను రద్దు చేసి మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొస్తూ ప్రభుత్వం 51 జీవోను తెచ్చిందని దీంతో కార్మికులకు పని భారం పెరిగిందన్నారు. కారోబార్తో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్స్ డ్రైవర్, చివరికి ప్రజా ప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత నిర్లక్ష్యం చేస్తున్న పనులనూ చేయించుకుంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీఓనెం.60 గ్రామపంచాయతీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ, పారిశుధ్య కార్మికులకు రూ.15600లు, కారోబార్, బిల్కలెక్టర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై కార్మికులకు రూ.19500లు, కంప్యూ టర్ ఆపరేటర్లు, టెక్నికల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రూ.22750ల వేతనం చెల్లించాలని, యాక్ట్ 2/94ను రద్దు చేసి పంచాయతీ సిబ్బందినీ పర్మినెంట్ చేయాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని అసిస్టెంట్ పంచా యతీ కార్యదర్శులుగా నియమించాలని, జీఓ నంబర్ 51ని సవరించాలన్నారు. మల్టీపర్పస్ వర్క ర్ విధానాన్ని రద్దు చేయాలని పంచాయతీ సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పిఎఫ్, ఈఎస్ ఐ, ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలన్నా రు. పంచాయితీ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్ల్ళు, ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేయాలన్నారు. ఇప్పటికే మల్టీపర్పస్ వర్కర్ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై డ్యూటీ చేయలేని స్థితిలో ఉన్నవారికి మరణించిన వారి కుటుంబ సభ్యులకు పంచాయితీల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. దళితబంధును ప్రాధా న్యతా క్రమంలో అమలు చేయాలని పాదయాత్ర బృందం కోరుతుందన్నారు. గ్రామపంచాయతీ కార్మి కుల సంఘం తాండూర్ మండలం అధ్యక్షులు శాం తమ్మ, ఉపాధ్యక్షులు వెంకటమ్మ, తులజమ్మ, నర్సి ములు, అంజలప్ప, వెంకటప్ప, సత్యమ్మ, పాల్గొన్నారు.