Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్
నవతెలంగాణ-పరిగి
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. మం గళవారం పరిగి పురపాలక సంఘ పరిధిలోని ఏడవ వార్డ్ గంగపుత్ర సంఘ భవనంలో రెండో విడత కంటి వెలు గు కార్యక్రమాన్ని కౌన్సిలర్ తంగడపల్లి వెంకటేష్‌తో కలిసి పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమా ర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఎంతోమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కంటి సమస్యలను పట్టించుకోకుంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉందన్నారు. అన్ని వార్డులలో కం టి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి వార్డులో ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంగు సంతో ష్, ఆసిఫ్, మల్లేష్, అనేం నర్సింలు, రవికుమార్, హాస్పిట ల్స్ సిబ్బంది, ఆశా వర్కర్లు, మెక్మా సిబ్బంది, పురపాలక అధికారులు, ఆయా కాలనీవాసులు పాల్గొన్నారు.