Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్
నవతెలంగాణ-తాండూరు
బహుజనలో రాజ్యాధికారం దీక్షకు అడుగులు వేయాలని పిఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమా వేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లా డుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువ కులకు అన్యాయం జరుగుతుందన్నారు. 1.92 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్న తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలలో ఇంకా పూర్తి చేయలేదన్నారు. బాబా సాహెబ్ విగ్రహాలను ప్రతిష్టించడం భవనాలకు పేర్లు పెట్టడం అభివృద్ధి కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కృషి చేసినప్పుడే ఆయన ఆశయాలను పూర్తి చేసినట్లని తెలిపారు. బహుజనులు అంతా ఏకమై బీఎస్పీని బలో పేతం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు డబ్బున్న వారికే కొమ్ముకాస్తుందన్నారు. కార్యక్ర మంలో రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, కో ఆర్డినేటర్లు బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, పసుపుల బాల స్వామి, వెంకటేష్ చౌహన్, గొల్ల సతీష్, వికారాబాద్ జిల్లా ఇన్చార్జి గండు రాజేశ్వర్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు క్రాంతి కుమార్, జిల్లా నాయకులు దొరిశెట్టి సత్యమూర్తి, జిల్లా మైనార్టీ కన్వీనర్ అంజద్ పాషా, తాండూర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పి అరుణ్ రాజ్, అసెంబ్లీ ఇన్చార్జి నవీన్ యాదవ్, సోషల్ మీడియా ఇన్చార్జ్ జయరామ్ బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.