Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్యలో తాండూర్ ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడుతుంది
- బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సౌహు శ్రీలత
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తాండూర్ కౌన్సిలర్ సౌ హు శ్రీలత మండిపడ్డారు. మంగళవారం పెద్దేముల్ మం డల కేంద్రంలో శక్తి కేంద్రం ఇన్చార్జ్ యాదయ్య గౌడ్ ఆధ్వ ర్యంలో ప్రజాగోస-బీజేపీ భరోసా కోర్నర్ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సౌ హు శీలత మాట్లాడుతూ...తాండూర్ ప్రాంతాన్ని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇద్దరి మధ్య గొడవల పట్ల తాండూర్ ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రైతులు పండించే ప్రతి గింజపై గిట్టుబాటు ధర కల్పించాలని డ ిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేద కు టుంబానికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్యం చికిత్స చేసుకోవచ్చన్నారు. కేజీ నుండి పీజీ విద్య ఇక్కడ కూడా అమలు నోచుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సం దీప్ కుమార్, పెద్దేముల్ మండల్ ఇన్చార్జ్ పూజారి పాండు, బీజేపీ నేతలు మమ్మద్ మహమూద్, రమేష్, పాల్గొన్నారు.