Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఫిర్యాదు
నవతెలంగాణ-దోమ
మండల కేంద్రంలోని దాదాపూర్ గ్రామ ముదిరా జ్లకు సంబంధించిన తరతరాల నుండి సర్వే నంబర్ 3,4 లలోని 3 ఏకారాల భూమిని వినియోగించుకుంటున్న శ్మశా న వాటికకు సంబంధించి గ్రామ గౌడ్స్ వారికి, ముదిరా జ్ల భూ వివాదంపై సోమవారం గ్రామ ముదిరాజ్ సం ఘం అధ్యక్షుడు బొక్క రమేష్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారాని గ్రామముదిరాజ్ అధ్యక్షుడు రమేష్ పేర్కొన్నారు. సుమారు 150 ఏండ్ల నుండి తాత తరాల నుండి వారి దహన సంస్కరణలో భాగంగా వారి మృతదేహాలను పాతిపెట్టడానికి సర్వే నెంబర్ 3,4 లో 3 ఎకరాల స్థలంలో ముదిరాజుల అందరం వినియోగిస్తు న్నామన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో ముదిరాజ్‌ల మృత దేహాలను పాతిపెట్టడానికి గౌడ్స్ వారు అడ్డుపడుతూ ఈ స్థలం 'మాది అని మాతో గొడవకు దిగుతున్నారన్నారు' అని విషయంపై పలుసార్లు మండల తహసీల్దార్‌కు విన్న వించుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు. సమస్యపై మండల స్థాయిలో ఏ అధికారులు పట్టించుకోలేదనీ, దీం తో సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మండల స్థాయిలో అధికారులు స్పందించి ముదిరాజ్‌ల శ్మశాన వాటికకు సంబంధించిన భూమిని సర్వే చేయించి ముదిరాజ్‌లకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షులు రమేష్, సర్పంచ్ కృష్ణ, గ్రామ మత్స్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.