Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి
నవతెలంగాణ-పరిగి
అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి పరిగి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి కేతా వత్ లలిత కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ సమయ పాలన పాటించాలని, అంగన్వాడి సెంటర్ ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచా లని సూచించారు.పరిశుభ్రత పాటించ లేనట్లయితే ఆ టీచర్ పై శాఖపరమైన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణులకు బాలింతలకు, ప్రీస్కూల్ విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందివ్వాలన్నారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తమ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయిన 0-5 సంవత్సరాల పిల్లలకు ప్రతి నెల ఎత్తులు, బరువులు తీయవలసి ఉంటుందన్నారు. బరువు, బలహీనంగా ఉన్నారని నిర్ధారణ జరిగితే అటువంటి పిల్లలకు అదనపు ఆహా రం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని తెలిపారు. గృహ సందర్శన చేసి గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం ఆవశ్యకతను అంగన్వాడీ టీచర్ వివరించాలన్నారు. ప్రీస్కూల్ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిం చాల ని, డిపార్ట్మెంట్ నుండి ఇచ్చిన మొబైల్లో ప్రతిరోజు పిల్లల హాజరు శాతా న్ని అంగన్వాడీ టీచర్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ, సూపర్వైజర్లు నీలవేణి, ఇందిర, పద్మ, యాదమ్మ, నిర్మల, అంజమ్మ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.