Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్
- మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల సందర్శన
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సూచిం చారు. వికారాబాద్ పట్టణంలో శివారెడ్డిపేటలో గల మైనారిటీ బాలికల వసతి గృహాన్ని పౌరసరఫరాల సంస్థ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు, డీజీఎం పీడీఎస్ అలివేలు మంగమ్మలతో పాటు రవీందర్‌సింగ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్ట ల్లో బియ్యం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చే శారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యార్ధినుల భవిష్యత్తుకు సంబంధించిన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థినులు నిరంతరం పర్యవేక్షిస్తూ వారి అభివృద్ధి, విజ్ఞానం కోసం పాటుపడతామని ప్రిన్సి పాల్ జి.అనుష తెలియ జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంటకు ఆర్ఓ వాటర్‌ను, మంచి రిఫండ్ ఆయిల్ వినియోగించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసర ఫరాల సంస్థ జిల్లా మేనేజర్ విమల, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు జి.అనుష, అకాడమిక్ కోఆర్డినేటర్ ఎండి జహీర్, డీటీ కార్తీక్, వైద్యనాథ్, సయ్యద్ అసరుద్దీన్, పౌరసరఫరాల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.