Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూధన్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విజ్ఞాన ప్రదర్శనలతోనే మేదస్సు పెంపొందిస్తుందని, సైన్స్ ఫెయిర్లు విద్యార్థుల మేధో శక్తికి ఎంతో దోహ దపడతాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉదయం నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యా ర్థులు ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ని ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ... ఇలాంటి సైన్స్ ఫెయిర్ వలన విద్యా ర్థులకి మేదోశక్తి లభిస్తుందన్నారు. విద్యార్థులకు మరింత జ్ఞానం పెరుగుతుం దన్నారు. విద్యార్థి దశ నుండే విజ్ఞానంపై విద్యార్థులు పట్టు సాధించాలని కోరారు. భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ సాధించిన విజయాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని విజ్ఞానంలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, డీన్ సృజన్, ఏఓ మల్లేష్, ప్రైమరీ స్కూల్ ఇన్చార్జి ప్రసన్న, సి బ్యాచ్ ఇన్చార్జి రఘుపతి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి దుర్గ, తదితరులు పాల్గొన్నారు.