Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాల ప్రిన్సిపాల్ పి.అపర్ణ
- ఆకట్టుకున్న టీఎల్ఎం మేళా
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల/కళాశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ పి.అపర్ణ సర్ సివిరామన్ చిత్ర పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ మండల విద్యాధికారి బాబుసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంగోలీ కాంపిటీషన్, వైజ్ఞానిక ప్రదర్శనలను వీక్షించారు. విద్యారు ్థలు, ఉపాధ్యాయులను, వీరిని ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ను అభినందించారు. కొత్తగడి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి, విద్యార్థులను అభినందిం చారు. అభ్యసన ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి బోధనోపకర ణాల ఉపయోగం చాలా అవసరం. ఉపాధ్యాయులు, విద్యార్థులు రూపొం దించిన అన్ని సబ్జెక్టులకు సంబంధిం చిన బోధనోపకరణాలను టీిఎల్ఎం మేళాలో భాగంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తార్కి క ఆలోచనను పెంచుకొని భవిష్యత్తులో భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.