Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ ప్రశాంత్న గర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజ న్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ వారు వారి యోగక్షేమాలు పంచుకోవడానికి, ఆటవిడుపు , కాసేపు ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం కోసం ఇది ఒక చక్కటి వేదిక అన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. చెస్ బోర్డ్, క్యారమ్ బోర్డ్ అందజేశారు. సీనియర్ సిటీజన్ సెంటర్లో టైల్స్ , గ్రిల్స్ ఏర్పాటుకు తోడ్పాటునదించిన రమేష్‌ను సన్మానించా రు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ముది రాజు, బీఆర్ఎస్ నాయకులు చాంద్ పాషా, జంగంగౌడ్, రాజేష్ సీనియర్ సిటీజన్స్ నాగేశ్వర్రావు, నర్సింలు, బాలకృష్ణ, లక్ష్మణ్, శివ, లక్ష్మీకాంత్‌రెడ్డి, రమేష్, శ్రీహరి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.