Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖలో నలసాని రామ్ ప్రసాద్ తన పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీ కోసం ఆచార్య పింగళి లక్ష్మీకాంతం జీవితం, రచనల పరిశీలన అనే అంశంపై తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెం కటేశ్వరరావు పర్యవేక్షణలో సుమారు ఆరేండ్ల పాటు పరిశోధన చేశాడు. ఈ పరిశోధ నకు గాను హెచ్‌సీయూ డాక్టరేట్ డిగ్రీని ఇస్తూ నోటిఫికే షన్ విడుదల చేసింది. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం విద్యా రంగానికి విశేషమైన కృషి చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో తెలుగు శాఖ ఏర్పడ డానికి, తెలుగు అకాడమీ రూపక ల్పనలోను, ఎంఏ స్థాయి లో పాఠ్యాంశాల రూపకల్పనలోను విశేషంగా కృషి చేశారు. తెలుగు సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్ష, గౌతమ వ్యాసములు మొదలైన గ్రంథాలతో పాటు పలనాటి వీర చరిత్ర, ద్విపద భారతం, రంగనాథ రామాయణం, విష్ణు పురాణం గ్రంథాల కు పరిష్కారం చేసి పరిశోధనాత్మకంగా పీఠికలు రాశారు. ఆంగ్ల దేశ చరిత్ర, గాం ధీజీ సూక్తులు వంటి గ్రంథాలు తెలుగులోకి రావడానికి చక్కని అనువా దాలు చేశారు. పింగళి- కాటూరి వారిరువురు అవధానాలు చేయడంతో పాటు జంట కవిత్వంగా సౌందరనందం అనే కావ్యాన్ని రాశారు. ఈయన కృషిని సమగ్రంగా పరిశీలన చేసి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా నలసాని రామ్ప్రసాద్ని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు అధ్యాపకులు ఆచార్య పిల్లల రాములు, ఆచార్య గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్‌కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, డాక్టర్ భూక్యా తిరుపతి, డాక్టర్ బాణాల భుజంగరెడ్డి, డాక్టర్ డి.విజరు కుమారి, తదితరులు అభినందించారు.