Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ సహకారంతో ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు
- వైద్య విద్యార్థిని ప్రీతి మరణం బాధాకరం
- బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రతినిధి
నాటి ప్రగతి నివేదన సభకు స్పూర్తిగా ప్రగతి నివేదన పాదయాత్ర సాగుతోందని బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ సహకారంతో ఫా ర్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రగతి నివేదనయాత్ర 37వ రోజు కొనసాగింది. మంగళవారం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి లోని కొంగరకలాన్, ఆదిభట్ల, కొంగరకలాన్ తండాలో తిరి గారు. సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెడికో ప్రీతి మృతి బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కొంగరకలాన్ తాండలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. అనంతరం కొంగరకలాన్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. ఈ యాత్ర జనవరి 22న నందివనపర్తి గ్రా మంలో ఆనందీశ్వరుని ఆశీస్సులు తీసుకొని ప్రారంభమైంద న్నారు. నేటికి 3మండలాలు, 1 మున్సిపాలిటీ, 37రోజు లు, 64 గ్రామాలు, 480 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తున్నామని తెలిపారు. 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నా యకత్వంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచంలో కనివినీ ఎరుగని రీతిలో కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభను విజయవంతం చేశారన్నారు. దానిని స్పూర్తిగా తీసుకొని ప్రగతి నివేదన యాత్ర చేస్తునని తెలిపారు. కలెక్ట ర్ కార్యాలయం నిర్మాణం కోసం రూ.58.20కోట్లు, నాదర్గుల్ నుంచి మంగల్‌పల్లి వరకు రోడ్ల విస్తరణ పనుల కోసం రూ.11కోట్లు, సీసీరోడ్లు, డ్రయినేజీకి రూ.3.90కోట్లు, కొంగర నుంచి మీరాఖాన్‌పేట్ వరకు సీసీరోడ్లు నిర్మాణం రూ.4.50కోట్లు, కొంగర నుంచి తుర్కగూడ వరకు రూ.4.75 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదిభట్లను మున్సిపాలిటీ చేశామన్నారు. ఆదిభట్ల ఏరోస్పేస్ సెంటర్లో అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే క్యాబిన్ ఇబ్రహీంపట్నంలోనే తయారువుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఎలిమినేడు లో కూడా రాబోయే రోజుల్లో పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ మున్పిపల్ అధ్యక్షులు కొప్పు జంగయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కోరె కళ్లమ్మ జంగయ్య, కౌన్సిలర్లు గోపగళ్ల మహేందర్, వనం శ్రీనివా స్, కో-ఆప్షన్‌సభ్యులు పల్లె గోపాల్, పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షులు గోపగళ్ల బాబులు ఇబ్రహీం పట్నం మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల్ వెంకట్‌రెడ్డి, యువజన విభాగం కార్య దర్శి జెర్కొని రాజు, నర్సగళ్ల ప్రవీణ్, విద్యా విభాగం నిట్టు జగదీశ్వర్, బంటి యూత్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.