Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శంషాబాద్
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని శంషాబాద్ మండల పరిధిలోని అమ్మపల్లి ఒయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్లో మంగళవారం కిండర్ గార్టెన్ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సైన్స్ ఫెయిర్లో ఎల్కేజీ, యూకేజీ విద్యా ర్థుల నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఆ యా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తయారు చేసిన వివిధ రకాల నమూనాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి మాట్లా డుతూ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి కొత్త కొత్త వస్తువుల తయారీ వాటి విలువ పర్యావరణం సామాజిక అంశాలను గురించి అవగాహన కల్పించడం కోసం సైన్స్ ఫెయిర్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రు లు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. లేత వయసులో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించడం భవిష్యత్తుకు పునాది కోసం కార్యక్రమం ఉపయోగ పడుతుందన్నారు. సైన్స్ ఫెయిర్ కార్య క్రమం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి మంచి స్పం దన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.