Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
వైజ్ఞానిక ప్రదర్శనలతో శాస్త్రీయ దృక్పథం పెరుగుతుం దని బీజేపీ నేత గజ్జల యోగానంద్ అన్నారు. పాపిరెడ్డినగర్ డివిజన్లోని రాజధాని హై స్కూల్లో యాద నరేందర్ గుప్త ఆధ్వర్యంలో నేషనల్ మెగా ఆర్ట్స్, సైన్స్ పేర్ పెష్టివల్ నిర్వహించారు. యోగానంద్ హాజరై విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు అద్భుతమైన వైజ్ఞానిక ప్రదర్శనలు చేశారని అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెరుగుందన్నారు. అలాగే వైజ్ఞానిక ప్రధశనల వలన విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. సంవత్సరంలో ఒక్క రోజే కాకుండా ప్రతీ మూడు నెలలకు ఒక్క సారైనా విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో కరస్పాండెంట్ నరేంద్ర గుప్త, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు అర్చనపల్లి సూర్యరావు, కో-ఆర్డినేటర్ కార్తిక్, ప్రధా న కార్యదర్శి గంగుల రాజారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రాకుమార్రెడ్డి, విశ్వకర్మ సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ గోవర్ధన్ ఆచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.