Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్విని యోగించుకోవాలని సర్పంచ్ పాత్లోత్ మంగ శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం మండల పరిధిలోని బండలే ముర్ గ్రామంలో కంటి వెలుగు కార్య క్రమం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం మరో వారం రోజులు ఉంటుందనీ, 18 పైబడిన వారందరూ పాల్గొన్ని , కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట్టంల సంతోష సత్యం,పంచాయతీ కార్య దర్శి సువర్ణ, ఎస్ఎంసీ చైర్మెన్ ముని రాజ్, వార్డు సభ్యులు బి. రమేష్, గ్రామస్తులు ఎన్.చంద్రయ్య, ఎం. ఐలయ్య, హెచ్. చిన్నకృష్ణ, శ్రీని వాస్, సత్తయ్య, పి.పోచమ్మ, ఆశా వర్కర్ ఎల్. పద్మ, బి.లక్ష్మి, అంగన్ వాడీ టీచర్ అంజలి, గ్రామస్తులు తది తరులు పాల్గొన్నారు.