Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్
నవతెలంగాణ-శంకర్పల్లి
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని కొండకల్ తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్,ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్ అన్నారు. ప్రముఖ భౌతిక శాస్త్ర పరిశోధకులు నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ఎఫెక్టను కనుగొన్న ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మంగళవారం కొండకల్ తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శాస్త్ర సాంకేతికపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికత దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు రూపొం ధించిన సైన్స్ మోడల్స్లపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు తెలిపారు.