Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మినివాస్
నవతెలంగాణ-షాబాద్
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సైఫ్‌ను బహిరంగంగా ఉరితీయాలి టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మినివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మంగళవారం హైతాబాద్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ప్రీతి నాయక్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ర్యాగింగ్ పాల్పడిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని, మెడికో ప్రీతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిం చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో తరచూ వెలుగు చూస్తున్న ర్యాంగింగ్ విష సంస్కృతిని నిషేదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమాంర్యాదవ్, రవీందర్, వెంకటేష్ ఉన్నారు.