Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలోని మహలిగాపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మహాలింగాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై చేరి, ఒకరి నొకరు ఆప్యాయతగా పలకరించుకుని, ఆనందాన్ని పంచు కున్నారు.చిన్ననాటి చిలిపి చేష్టలను తలుచుకుని స్మరించు కున్నారు. అనంతరం ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు శాలువలతో సన్మానించారు.