Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజాన్ అనంతరం పనులు ప్రారంభం
- మాస్టర్ ప్లాన్ అమలుపై వక్ఫ్ బోర్డ్ అధికారులతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమీక్ష
నవతెలంగాణ-కొత్తూరు
రంజాన్ మాసం అనంతరం జహంగీర్ పీర్ దర్గాలో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మాస్టర్ ప్లాన్ అమలు తీరు పట్ల వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మహ్మద్ షఫీ ఉల్లా, వక్ఫ్ బోర్డ్ చైర్మెన్ మసి ఉల్లా ఖాన్, స్థానిక వ్యాపారస్తులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్గాలో వ్యాపారస్తుల ఉపాధికి ఎలాంటి డోక ఉండదని అభయ మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన విధంగా మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు నిరాటకంగా కొనసాగుతాయనీ, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. దర్గాను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న చిన్న వ్యాపా రస్తుల ఉపాధికి డోకా లేకుండా మాస్టర్ ప్లాన్ ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వరి, తహసీల్దార్ రాములు, బీఆర్ఎస్ నాయకులు మైనార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.