Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంషాబాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల డిమాండ్
నవతెలంగాణ- శంషాబాద్
జర్నలిస్టు గోపాల్‌పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని శంషాబాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకార ణంగా కొంతమంది వ్యక్తులు జర్నలిస్ట్ గోపాల్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 26వ తేదీన శంషాబాద్ ప్రింట్ మీడియా జర్నలిస్టు అలమనేటి గోపాల్ మండల పరిధిలోని కేబీ దొడ్డి గ్రామం నుంచి శంషాబాద్ వస్తున్నాడని తెలిపారు. నర్కూడ రెవెన్యూ పరిధిలోనీ ధర్మకాంట సమీపంలోకి రాగానే తనకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఆయ న తన వాహనాన్ని పక్కకు ఆపుకొని ఫోన్ మాట్లాడుతుం డగా నర్కూడ గ్రామానికి చెందిన బండ్లకాడి రాజుతో పాటు మరికొంత మంది వచ్చి అతని పై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజ ల వైపు నిలబడే జర్నలిస్టులపై దాడులు సహించరాద న్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శంషా బాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బి. దేవేందర్, డీ. కృష్ణ, సుదర్శన్, భాను, యాదయ్య శ్రీనివాస్, పి.మాధవచారి, ఎం.చంద్రకుమార్, విక్రమ్‌కుమార్, మహమూద్, ఠాగూర్, అంజి, ఎం.శ్రీనివాస్, పాల్గొన్నారు.