Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో ఏడేండ్లుగా జరగని బదిలీలు, పదోన్నతులు
- ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన 317 జీవో
- టీఎస్‌యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
విద్యారంగ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో పదోన్నతులు బదిలీలు జరగకపోవడం హాస్యస్పందంగా ఉంద న్నారు. ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ రోజుకు కుంటుపడు తుందన్నారు. గురువారం తాండూర్ పట్టణంలోని సంఘం కార్యాయలంలో విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల లో ఖాళీల కారణంగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవు తుందన్నారు. పాఠశాలలో పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాస్తా మని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నేటికీ అమలు కావడం లేదన్నారు. ఉపాధ్యాయులకు 317 జీవో ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రభు త్వం కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడుస్తుందన్నారు. సెక్రటేరియట్ కేంద్రంగా అక్రమ ఉపాధ్యాయ బదిలీలు కొనసాగుతున్నాయని మండి పడ్డారు. అక్రమ బదిలీలను ప్రోత్సహిస్తున్న సంఘాలకు ఉపాధ్యా యులు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు వెళ్లకుండా వివిధ రకాల కారణాలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించి అ క్రమ పద్ధతి ద్వారా బదిలీలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. సీపీఎ స్ విధానంతో ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుంద న్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి కనువిప్పు చేయాలన్నారు. విద్యారంగ పరిరక్షణ లక్ష్యంగా టీఎస్‌యూటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సంఘంతో సంబంధం లేకుండా ప్రతి ఉపాధ్యాయుడి సమస్య పరిష్కా రమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామన్నారు. అనంతరం వికారాబాద్ అధ్యక్షులు వెంకటరత్నం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న మాణిక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ నాయకులు నారాయణ గౌడ్, భాను చైతన్య, వెంకటప్ప, నర్సింలు. శ్రీనివాస్, షాపూద్దీన్, నర్శ నాయక్, రవికుమార్, విట్టల్ గౌడ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.