Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లోని రామకృష్ణ హౌమియో ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా కంపెనీ మూసి వేయడంతో అందులో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారని, వారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉంటానని డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం కంపెనీలో పని చేసే కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హౌమియోపతి కంపెనీలో సుమారు 30 నుంచి 40 ఏండ్ల నుంచి కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కంపెనీ యా జమాన్యం మూసివేయడంతో దీనిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కుటుం బాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, 52 వారాలుగా పీఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ బకాయిలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కంపెనీ యాజమాన్యంతో చర్చిం చినప్పుడు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా యాజమా న్యం స్పందించి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్, రావుల భాస్కర్, మల్లేష్, బాల్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్, శివ శంకర్, శోభా, శివ లీల, తదితరులు పాల్గొన్నారు.