Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు అప్పు కట్టకపోతే ఇంట్లో ఉన్న మేకలను తీసుకెళ్తాం
- గోట్లపల్లి రుణాల రికవరీలో బ్యాంక్ అధికారుల మొండి వైఖరి
- బ్యాంకు అధికారుల తీరుపై రైతు ఆగ్రహం
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రండి..! ఇంటికి తాళం వేస్తాం... లేదంటే ఇంట్లో ఉన్న మేకలను తీసుకువెళ్తామం టూ.. బ్యాంక్ అధికారులు రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శించారు. పెద్దేముల్ మండలం గోట్లపల్లి గ్రామంలో తాండూరు పట్టణానికి చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు ఓ రైతు ఇంటికి వెళ్లి జులుం ప్రదర్శించారు. గోట్లపల్లి గ్రామానికి చెందిన వడ్డే మక్తలయ్యకు గ్రామ శివారులో 3.13 ఎకరాల ప్రభుత్వం అసైన్మెంట్ భూమి ఉంది. అందులోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నా డు. పంటల సాగు కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2019లో రూ.1,36,000 అప్పు తీసుకున్నాడు.2022 నాటికి అది కాస్త రూ.రెండు లక్షల 15 వేలు అయింది. అదే బ్యాంకులో 2014లో రీ షెడ్యూల్ ద్వారా రూ.50,000 టర్మ్ లోన్ ఇప్పుడు వడ్డీతోపాటు రూ.80వేలకు పెరిగింది. అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు రైతుకు పలుమార్లు కోరినా రైతు అప్పు చెల్లించలేకపోయాడు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో మాఫీ అయితాయని ఆశపడ్డాడు. కొంత డబ్బు ఉంటే ఎలాగైనా చెల్లిస్తానని అను కున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణ మాఫీ ఇంకా కాలేదు. బ్యాంకులో అప్పుకు వడ్డీ పెరిగిపో తుంది. బ్యాంకులో రూ. రెండు లక్షలు అప్పు దాటడంతో బ్యాంక్ అధికారులు అతనికి నోటీసులు పంపించారు. అ యినా కూడా రైతు డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారు లు మేనేజర్ ఆంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్ జ ైన్న్, రమేష్ రంగంలోకి దిగారు. రైతు ఇంటికి వెళ్లి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటలు పంటలేవు, తన వద్ద డబ్బులు లేవు, పంటలు పండితే కడతానని రైతు చెప్పారు. దాంతో తాళం చేతులో పట్టుకొని ఇల్లు తలుపులు కాళ్లతో తన్ని, ఇంట్లో ఉన్న మేకలను తీసుకపోతామని ఉ క్కుం జారీ చేశారు. డబ్బులు కడతారా ఇంటికి తాళం వె య్యమంటారని రైతుని ప్రశ్నించారు. ప్రస్తుతం రూ.15 వేలు కట్టాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ప్రస్తుతానికి అన్ని డబ్బులు లేవని, రూ.5వేలు కడతానని రైతు చెప్పాడు. దీంతో బ్యాంక్ అధికారులు రూ.5వేలు కట్టించుకుని రసీదు ఇచ్చారు. మిగతా డబ్బులు కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు.