Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలగల్లా విద్యార్థుల రక్తం పిండుకుంటున్న యాజమాన్యం
- మార్కులు, ర్యాంక్‌ల కోసం విద్యార్థులను చంపుతున్న పట్టని ప్రభుత్వం
- విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
- శ్రీ చైతన్య గుర్తింపు రద్దు చేయాలి
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారాయని ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం మం డల అధ్యక్షుడు ఏర్పుల తరంగ్ అన్నారు. ఫీజుల పేరుతో విద్యార్థులను జలగల్లా రక్తం పిండుకుంటున్నాయని విమ ర్శించారు. మార్కులు, ర్యాంక్‌ల కోసం విద్యార్థులను చంపు తున్న పట్టని ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. నార్సింగ్‌లో శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి, కళాశాల గుర్తింపుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వ ర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నెల రోజుల క్రితం ఫర్జా దిగూడలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్నారు. నేడు నార్సింగ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సా త్విక్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డన్నారు. విద్యార్ధులపై మార్కులు, ర్యాంకుల కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ విద్యార్థుల ఆత్మహ త్యలకు కార్పొరేట్ శ్రీ చైతన్య నిలయంగా నిలిచిందన్నారు. యాజ మాన్యం లాభాలే ధ్యేయంగా ర్యాంకులే లక్ష్యంగా పని చేస్తు న్నాయన్నారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీ చైతన్య గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చే శారు. లేని పక్షంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి వంశీ, నాయకులు లక్ష్మణ్, వర్షిత్, మధు, లోకేష్, కిషోర్, సంపత్, కిట్టు పాల్గొన్నారు.