Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనంతరం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
- సీసీ కెమెరాలు ఆధారంగా డబ్బును గుర్తించిన పోలీసులు
- తిరిగి రూ.లక్షా 70 వేలు బాధితురాలికి అందజేత
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అనే పదానికి నిదర్శనం వికారాబాద్ పట్టణంలో గురువారం జరిగిన ఈ సంఘట. తాండూరు మండల పరిధిలోని సిరిగిరిపేటకు చెందిన బాలమణి ఫిబ్రవరి 28న వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ నుంచి బస్టాండ్‌కు ఆటోలో వెళ్ళింది. బాలమని ఆటో సీటు వెనుక భాగంలో రూ.1,70,000 డబ్బుతో ఉన్న కవర్‌ను తన వెంట తీసుకొని బస్టాండ్ వెళ్ళింది. బస్టాండ్ రాగానే తన వద్ద ఉన్న కవర్‌ను మర్చిపోయి ఆటో దిగింది. బాలమని గంట తర్వాత కవర్‌ను మర్చిపోయానని గ్రహించి వికారాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా విచారణ చేపట్టి ఆటో వికారా బాద్ పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తాలో ఉండటాన్ని గమనించారు. వెళ్లి చూడగా అందులో డబ్బులు ఉండటంతో వాటిని వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీను బాధితురాలికి అందజేశారు. తన మనవరాలి పెళ్లి కోసం డబ్బు సమకూర్చుకున్నానని, డబ్బులు తిరిగి ఇచ్చినందుకు పోలీసులకు బాలమణి ధన్యవాదాలు తెలియజేసింది.