Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
- ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ
- సీఎం కేసీఆర్‌కు మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ 'హౌన్ హై ఫాక్స్ కాన్ ' తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నుంచి చేపట్టనుండటం ఎంతో సంతోషకరమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో మరో అతిపెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థను నెలకొల్పనుందని ఆమె తెలిపారు. గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూకితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితాఇం ద్రారెడ్డి, కేటీఆర్, హరీశ్‌రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కొంగరక లాన్- రావిర్యాల్ ప్రాంతంలో సుమారు 250 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందన్నారు. విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉంటే ఫలితాలు ఇలానే ఉం టాయన్నారు. తెలంగాణను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చుతున్న ఘనత ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూకి జిల్లాలో సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల రాకకు బాటలు వేస్తుందన్నారు.