Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
- రాష్ట్రం వచ్చినా పేదల బతుకులు మారలేదు
- మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పుట్టిన రోజు వేడుకులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణలో పేదల బతుకులు బాగు పడలేదని, కేవ లం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. స్వరాష్ట్రంలో పేదల బతుకులు మరింత దిగజారాయని ఆందోళన వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంట్ మాజీ ఎంపీ బూర నర్స య్యగౌడ్ పుట్టిన రోజు వేడుకులు ఇబ్రహీంపట్నంలోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్లో నిర్వహించారు. ఈ వేడుకులకు ఆయ న హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వ హించారు. ఈ సందర్భంగా బండి సంజరు మాట్లాడుతూ రాష్ట్రంలో లైంగికదాడులు చేసే వాళ్లు బీఆర్ఎస్, ఏంఐఏం వాళ్లే అయి ఉంటారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని అన్నారు. వైద్య విద్యార్థిని హత్య చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణలో ఆర్టీ సీ ఉద్యోగుల పరిస్థితి నేడు దుర్బరంగా మారిందని ఆందో ళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకా ఎవరి బ తుకులు బాగుపడలేదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. కాళేశ్వరం కట్టినా రైతులకు ఏం ఉప యోగం లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీరు రాకుం డా కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు చేసి అన్యాయం చేశా రని విమర్శించారు. తెలంగాణకు వచ్చిన నిధులు డైవర్ట్ చేస్తున్నారన్నారు. మోడీ ఇస్తున్న డబ్బులు కేసీఆర్ దోచు కుంటున్నారని విమర్శించారు. ఆరు నెలలుగా ముఖ్యమం త్రి అభివృద్ధిపై మాట్లాడలేదని చెప్పారు. అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరినా ముఖ్యమంత్రి ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రశ్నించారు. పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చిందంటే కేవలం దవాత్ కోసమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజీపీ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్రం మ్యాచింగ్ గ్రంటు ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కున శ్రీశైలంగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, సామ రంగారెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, వీరస్వామిగౌడ్, పోరెడ్డి నర్సింహారెడ్డి, అర్జున్‌రెడ్డి, బోసుపల్లి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.