Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోసపూరిత కేసీఆర్ సర్కార్ సాగనంపాలి
- అమలుకు నోచుకోని బీఆర్ఎస్ ఎన్నికల హామీలు
- మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి
- ఇబ్రహీంపట్నంలో హాథ్ సే హాథ్ జోడీ యాత్ర
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేసీఆర్ రాక్షస పాలనకు చరమ గీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి పిలుపునిచ్చారు. మోసపూరిత కేసీఆర్ సర్కార్ సాగనంపాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన బీఆర్ఎస్ హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టారు. ఉదయం నుంచి ఇంటింటికీ తిరుగుతూ గతంలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీని యర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, దండెం రాంరెడ్డితో కలి సి ఆయన మాట్లాడారు.. తొమ్మిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ దుర్మార్గపు పాలన సాగిస్తున్నాయని అన్నారు. అర్హులకు కూడా పెన్షన్ రావడం లేదన్నారు. ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నాడన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని మోడీ యువతను మోసం చేశారని తెలిపారు. కాం గ్రెస్ రూ.400కే గ్యాస్ సిలిండర్‌ను అందజేస్తే నేడు బీజేపీ ప్రభుత్వం రూ.1100కు పెంచిందన్నారు. కాంగ్రెస్ అధికా రంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తామని వాగ్ధానం చేశారు. ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల వైద్యం కల్పిస్తామని చెప్పారు. ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉన్న అర్హులకు రూ.5లక్షలు ఇస్తామని ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించినట్టు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని మోసం చే స్తుందన్నారు. అది కూడా ఎన్నికల పథకంగానే మారనుం దని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత, గిరిజనులకు కుటుం బానికి మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ ఊసేత్తడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ.లక్షా 52వేల అప్పు ఉందన్నారు. ధరణి పేరుతో రైతులకు దగా చేస్తుందని మండిపడ్డారు. భూములను చెరబట్టి, కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరో పించారు. సీనియర్ కాంగ్రెస్ నాయ కులు త్యాళ్లపల్లి కృష్ణ, స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పండాల రమేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పండాల శంకర్‌గౌడ్, కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ కళ్లెం శ్రీధర్ రెడ్డి, కుంట్ల ఉదరుపాల్రెడ్డి, కప్పటీ రఘు, మహిళ కాం గ్రెస్ జయమ్మ, రాంబాబు, వార్డు సభ్యులు రాహుల్, యువ జన నాయకులు శేఖర్‌యాదవ్, బుగ్గ రాములు పాల్గొన్నారు.